తవ్వి వదిలేసిన రోడ్డును నిర్మించండి – డీసీకి ఏఐఎఫ్ డీవై వినతి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని ముజాఫర్ అహ్మద్ నగర్ లో రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని ఏఐఎఫ్ డీవై యువతుల విభాగం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ఎం.డి.సుల్తానా బేగం, గ్రేటర్ కమిటీ సభ్యులు టి. సతీష్ కుమార్ అన్నారు. ఈ మేరకు చందానగర్ సర్కిల్ కార్యాలయంలో డీసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ పక్కన గల నారాయణ కాలేజీ నుండి కృషి నగర్ కమ్యూనిటీ హాల్ వరకు రోడ్డును తవ్వి యూజీడీ వేసి వదిలేశారన్నారు. తవ్విన రోడ్డును జీహెచ్ఎంసీ అధికారులు అలానే వదిలేయడంతో ప్రజలు తరచూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిగా ప్రజలు నానా పాట్లు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. అధికారులు స్పందించి వెంటనే ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ ఎంసీపీఐయూ కార్యాలయం నుండి కృషి నగర్ మెయిన్ రోడ్డు వరకు తక్షణం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here