నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మూడో దశ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరీ రాంచందర్ యాదవ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే ను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మూడో దశ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నేతాజీ నగర్ కాలనీలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సామాజిక దూరాలు పాటించాలని, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. అనంతరం అవసరం ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాయుడు, యూత్ గౌరవ అధ్యక్షులు కే రాము యాదవ్, రమేష్ గుప్తా, జయమ్మ, విద్యావతి, జిహెచ్ఎంసి సిబ్బంది రాజేష్, వెంకటయ్య, కాలనీ పెద్దలు యువజన నాయకులు పాల్గొన్నారు.