చట్టాల మార్పులతో కార్మికులు రోడ్డున పడుతున్నారు – ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్

నమస్తే శేరిలింగంపల్లి: కార్మిక చట్టాలలో పాలకవర్గాలు తీసుకువచ్చిన మార్పులతో పరిశ్రమలు మూతపడి సంఘటిత, అసంఘటిత కార్మికులు రోడ్డున పడ్డారని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారాం నాయక్ వాపోయారు. నడిగడ్డ తాండలో దేశ, రాష్ట్ర కార్మిక శాఖలు అసంఘటిత కార్మికులకు జారీ చేస్తున్న ఈ శ్రమ్ కార్డుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రైవేటీకరణ పెరగడంతో లక్షల కోట్ల మంది సంఘటితంగా మారిపోయారన్నారు. భారత, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులకు మరిన్ని ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. నడిగడ్డ తాండ లో ఈ శ్రమ్ నమోదు కార్యక్రమం చేపట్టిన కార్మిక శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, గిరిజన సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు ఇ. దశరథ్ నాయక్, చాందీ బాయ్, గౌరీ బాయ్, సురేష్ నాయక్, శ్రీ రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

నడిగడ్డ తండాలో ఈ శ్రమ్ కార్డు నమోదు చేస్తున్న అధికారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here