బిజెపి సూక్ష్మవిరాళ సేకరణను విజయవంతం చేయాలి – బిజెపి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా చేపట్టిన సూక్ష్మ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో జయప్రదం చేయాలని బిజెపి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ అన్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి నాయకులతో తారానగర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. గజ్జల యోగానంద్ మాట్లాడుతూ బిజెపి బలోపేతానికి దేశ‌వ్యాప్తంగా సూక్ష్మ విరాళాల సేక‌ర‌ణ కార్యక్రమం మొదలైందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతీ డివిజన్ లో సూక్ష్మ విరాళాల సేకరణ కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ వరకు దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వారీగా, బిజెపి కార్యకర్త రూ.10 నుండి రూ.1000 వరకు ఎంతైనా వారికి తోచిన విదంగా నరేంద్రమోదీ యాప్ ద్వారా ఆన్ లైన్ లో పేమెంట్ చేయవచ్చన్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు తప్పకుండా సూక్ష్మ విరాళాల కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాంరెడ్డి, రాజు కురుమ, బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, సింధు రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, కుమార్ యాదవ్, నాయకులు మహిపాల్ రెడ్డి, రాకేష్ దూబే, శ్రీనివాస్ రెడ్డి, చిట్టా రెడ్డి ప్రసాద్, శ్రీనివాస్ ముదిరాజ్, లలిత, వేణు గోపాల్, చిన్నం సత్యం, ప్రశాంత్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సూక్ష్మ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here