నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్, వేముకుంట కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాదయాత్ర చేశారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ స్తంబాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేసి దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. కాలనీలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడం పట్ల కాలనీ వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. ఇందిరా నగర్, వేముకుంట కాలనీ లలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, జలమండలి డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సుబ్రహ్మణ్య రాజు, సునీత, ఏఎంఓహెచ్ కార్తిక్, టౌన్ ప్లానింగ్ టీపీఎస్ మధు, ఎలక్ట్రికల్ ఏఈ రాజ్ కుమార్, సురేందర్, ఎస్ ఆర్ పీ మహేష్, బాలాజీ, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు మిరియాల రాఘవ రావు, జనార్దన్ రెడ్డి, వెంకటేష్ ముదిరాజ్, దాసరి గోపి, గుడ్ల ధన లక్ష్మి , పుల్లిపాటి నాగరాజు, మిరియాల ప్రీతమ్, రవీందర్ రెడ్డి, ఓ. వెంకటేష్, గోవర్ధన్, మల్లేష్, అక్బర్ ఖాన్, అంజద్ పాషా, దాస్, గిరి, ఇమ్రాన్, ప్రవీణ్ రెడ్డి, హరీష్, యశ్వంత్, ఖాదర్, కుమార్, అల్తాఫ్, సందీప్ రెడ్డి, శ్రీధర్, వరలక్ష్మి, కార్తీక రెడ్డి, పార్వతి, అనిత, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.