నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మంజూరైన రూ. 2.54 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అత్యవసర చికిత్స కోసం ఖర్చు చేసిన పేదలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చంద్రమ్మ కాలనీ కి చెందిన మధు కి చికిత్స కోసం రూ. 2 లక్షల ఎల్ ఓ సీ ని అందజేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్ కాలనీ కి చెందిన సంజయ్ ప్రసాద్ పాశవన్ కి రూ. 54 వేల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను పటేల్ తదితరులు పాల్గొన్నారు.