నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు దశల వారీగా పరిష్కరిస్తామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గౌతమి ఎన్ క్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కార్పొరేటర్ హమీద్ పటేల్ జలమండలి అధికారులతో కలసి సమావేశమయ్యారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. జలమండలి అధికారులతో కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడి త్వరిత గతిన సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. మంచినీటి సరఫరా సమయాన్ని పెంచటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. గౌతమి ఎన్ క్లేవ్ లో గల స్పోర్ట్స్ గ్రౌండ్ ను అభివృద్ధి చేసి, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ తదితర సామాగ్రిని ఏర్పాటు చేస్తామని కార్పొరేటర్ అసోసియేషన్ సభ్యులకు హామీనిచ్చారు. ఈ సమావేశంలో వాటర్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, మేనేజర్ సందీప్, గౌతమి ఎన్ క్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ యస్ కృష్ణ మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎమ్. ధర్మారెడ్డి, సెక్రటరీ వై. చైతన్య, జాయింట్ సెక్రటరీ బి. కిరణ్ కుమార్, సభ్యులు ఏ. శ్రీకాంత్, కె. శైలజ, కె. లక్ష్మి దేవి, దీపేష్ షా, ఈ. రామ్ మోహన్ రావు, బి. సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
