జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ ను కలిసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, శంభీపూర్ రాజు తో కలిసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం ఉన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భేతి సుభాష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తో పాటు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యమంత్రి ‌కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here