నమస్తే శేరిలింగంపల్లి: ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల శిక్షణ సర్టిఫికెట్లతో పాటు గతంలో పెండింగ్ లిస్ట్ లో ఉన్న ఆర్ ఎం పీ వైద్యుల కు శిక్షణ తరగతులు నిర్వహించేలా చూడాలని టీఆర్ పీ ఎస్ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డైరెక్టర్ అఫ్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు సెక్రటరీ బి. ప్రేమ్ కుమార్ ని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్య సంఘం సభ్యులు కలిశారు. ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సమస్యలపై మాట్లాడారు. ప్రేమ్ కుమార్ ని శాలువాతో సత్కరించి నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీని అందజేశారు. డా. బాలకృష్ణ, వెంకట్, వైద్య బృందం ఉన్నారు.
