నమస్తే శేరిలింగంపల్లి: పారిశుధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తడి పొడి చెత్తను వేరు చేసింది స్వచ్ఛ్ ఆటోల్లో వేయాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సూచించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు కేటాయించిన 10 స్వచ్ఛ్ ఆటోలను కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, శానిటేషన్ (ఎస్.ఆర్.పి) లతో కలిసి లబ్ధిదారులకు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కాలనీల్లోకి వచ్చే స్వచ్ఛ్ ఆటో టిప్పర్ లో తడి, పొడి చెత్త వేసేందుకు వేర్వేరు డబ్బాలు ఉంటాయని, ప్రజలు గమనించి వేయాలన్నారు. తడి, పొడి చెత్తను వ్యవస్థాగత పద్ధతిలో సేకరించడానికి జీహెచ్ఎంసీ నగరంలో స్వచ్ఛ ఆటో టిప్పర్లను నూతనంగా వినియోగంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలు సహకరించి తడి, పొడి చెత్తలను వేరు చేసి పారిశుధ్య పరిరక్షణకు పాటుపడాలని కోరారు.