కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ సూచించారు. కరోనా మహమ్మారి మూడో దశ ప్రభావిస్తున్న తరుణంలో బిజెపి ఆదేశాల మేరకు స్వస్థ్య స్వయం సేవక్ అభియాన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ ను కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దేశం మొత్తం ఉచిత వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వర్క్ షాప్ ఇంఛార్జిగా జ్ఞానేంద్ర ప్రసాద్ నియామకమయ్యారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మెడికల్, హెల్త్ వర్క్ షాప్ సభ్యులు రఘునాథ్ యాదవ్, ఆంజనేయులు, హరిప్రియ, మాణిక్ రావు, బాబురెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన జ్ఞానేంద్ర ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here