నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా ఆయా జిల్లాల అధ్యక్షులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. కొమురం బీమ్ అసిఫాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమితులైన కోనేరు కొనప్పను, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమితులైన ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ను వారివారి నివాసాల్లో ప్రభుత్వ విప్ గాంధీ కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఉన్నారు.