టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుకు విప్ గాంధీ శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా నియామకమైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గురువారం ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంభీపూర్ రాజును ఎమ్మెల్యే గాంధీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, కొలుకుల జగన్, సత్యనారాయణ, సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కోనేరు ప్రసాద్, దొడ్ల రామకృష్ణ గౌడ్, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here