శేరిలింగంపల్లిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

నమస్తే శేరిలింగంపల్లిః భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అంబరాన్నంటాయి. ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు గురువారం వాడవాడన మువ్వన్నెల జెండాను ఎగవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నే శ్రీనివాసరావు, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ సీఐ తిరుపతి రావు, ట్రాఫిక్ సీఐ సుమన్, వార్డు సభ్యులు, ఆయా డివిజన్ల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ చేసిన ప్రభుత్వ విప్

మియాపూర్ డివిజన్ పరిధిలో…

మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ, సాయి కాలనీ, ఎఫ్ సీ ఐ కాలనీ, నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, మక్తా మహుబూబ్ పెట్ విలేజ్, ప్రశాంత్ నగర్, ఎంఏ నగర్, ప్రగతి ఏంక్లేవ్, ఎఫ్ సీ ఎల్ కాలనీ లో ని సేంట్ రీటా స్కూల్, పలు కాలనీలలో అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మువ్వన్నెల జెండాలను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గంగాధర్ రావు, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, పురుషోత్తం యాదవ్, గోపరాజు శ్రీనివాస్ రావు, మాధవరం గోపాల్ రావు, వజీర్, ఖాజా, జహంగీర్, రాజేష్ గౌడ్, సుప్రజ, రమేష్, ప్రసన్న, నరేందర్, కిరణ్, దయానంద్, శ్రీధర్, నరేష్, నర్సింగ్, చందు, నాగరాజు, రాజు గౌడ్, విజయ్, మల్లేష్, రాజు, శివ, రవి గౌడ్, చిరంజీవి, శివాజీ, అనిల్,ఎదుల్లా, మహబూబ్, కృష్ణ రావు, రాజు ముదిరాజ్, ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులు, స్థానికుకులు పాల్గొన్నారు.

జాతీయ జెండా‌ వందనం చేస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

మాదాపూర్ డివిజన్ పరిధిలో…

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాదాపూర్ డివిజన్ గుట్టల బేగంపేట మాదాపూర్ వార్డ్ కార్యాలయంలో జాతీయ జెండాను మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, బస్తి కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ వార్డు కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్  గౌడ్

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో..

హఫీజ్ పెట్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హఫిజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదేశ్వర్ గౌడ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

హఫీజ్ పేట్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను‌ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

చందానగర్ డివిజన్ పరిధిలో..

చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మి నారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, గురుచరణ్ దుబే, పులిపాటి నాగరాజు, ధనలక్ష్మి, పబ్బ మల్లేష్, ఓ.వేంకటేష్, రవిందర్ రెడ్డి, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ లో‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

శేరిలింగంపల్లి డివిజన్ లో..
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా‌ నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్, పద్మశాలి భవన్, సాగర సంఘం,‌ బాపునగర్,‌ గచ్చిబౌలి గ్రామంలో జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాపునగర్ లో జాతీయ జెండాను అవిష్కరిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

కొండాపూర్ డివిజన్ లో..
73వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్, సిద్దిఖ్ నగర్, బంజారా నగర్, న్యూ పీజేఆర్ నగర్, ప్రేమ్ నగర్, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీలలో కార్పొరేటర్ హమీద్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

బిజెపి ఆధ్వర్యంలో…
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీదు బండ, లింగంపల్లి, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, సాయి నగర్, హఫీజ్ పేట్, ప్రేమ్ నగర్ బి బ్లాక్, కొండాపూర్ ఎక్స్ రోడ్, తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు బిక్షపతి యాదవ్ పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

జాతీయ జెండాకు వందన సమర్పణ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

రాఘవేంద్ర కాలనీ, సుభాష్ చంద్రబోస్ నగర్, హైటెక్స్, ఇజ్జత్ నగర్, మక్తా, హైదర్ నగర్, కూకట్ పల్లి దీనబంధు కాలనీ, పాపిరెడ్డి నగర్, సిద్దిక్ నగర్ , బంజారా బస్తి, వడ్డెర బస్తి లలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జాతీయ జెండాకు వందనం చేస్తున్న బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్

ఆల్విన్ ఎక్స్ రోడ్ బిజెపి కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు యోగానంద్, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు నాగులు గౌడ్, మహేష్ యాదవ్, రమేష్ సోంశెట్టి, శ్రీశైలం కురుమ, మనోహర్, రవి గౌడ్, వర ప్రసాద్, జితేందర్, కోటేశ్వరరావు, మాణిక్ రావు, విజేందర్, పృథ్వీ కాంత్, బాబు రెడ్డి, లక్ష్మణ్, నారాయణరెడ్డి, జగన్, సిద్దు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

అల్విన్ ఎక్స్ రోడ్డులో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీనగర్ కాలనీలో బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కసిరెడ్డి సింధూ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు మురళీధర్, వీరేశం, శివరామకృష్ణ, రవిబాబు, బీజేపీ నాయకులు రాకేష్ దూబే, పగడాల వేణుగోపాల్, శ్రీనివాస్ ముదిరాజ్, శివకుమార్ వర్మ, నిషాత్ తదితరులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

గౌతమి నగర్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి

గచ్చిబౌలి డివిజన్ లో…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి కార్పొరేటర్ కార్యాలయం ఆవరణలో 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ లోని బిజెపి సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ వార్డు కార్యాలయం ఆవరణలో జాతీయ జెండావిష్కరణ చేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
గణతంత్ర దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వై. నరేందర్ రెడ్డి, కోటమ్ రెడ్డి వినయ్ రెడ్డి, జెర్రీ పెట్టి జైపాల్, మైపాల్ యాదవ్, రఘునందన్ రెడ్డి, ఇలాయస్ షరీఫ్, సురేష్ నాయక్, భరత్ గౌడ్, నగేష్ నాయక్, మారేళ్ల శ్రీనివాస్, బాశెట్టి అశోక్, జావీద్ హుస్సేన్, జహంగీర్, అజీముద్దీన్, ఆయాజ్ ఖాన్, పోచయ్యి, రాజేందర్, నరసింహ గౌడ్, హరికిషన్, యువజన నాయకులు సౌందర్య రాజన్, శ్రీహరి గౌడ్, దుర్గేష్, ముష్రఫ్, కరీం, అసద్, ఖాజా, మెహ్రాజ్ ఖాన్, రాజేష్ గౌడ్, దుర్గ దాస్, సాయి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు

సీపీఐ ఆధ్వర్యంలో..

శేరిలింగంపల్లి మండల పరిధిలోని వివిధ బస్తీలలో సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కే చందు యాదవ్, ఏఐటియుసి కార్యదర్శి డి.రవి, కె. ఖాసిం, కె. వెంకట స్వామి, ఎస్. కొండల్, కె. సుధాకర్, దేవేందర్, కురుమూర్తి, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండావిష్కరణ లో సీపీఐ

ఏఎస్ వై ఎఫ్ ఆధ్వర్యంలో….

ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఎస్ వై ఎఫ్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నరేందర్, అశోక్, శ్రీనివాస్, భాను ముదిరాజ్, శివ, స్వరూప్, చందు, లవకుశ్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ జెండావిష్కరణ చేసిన రోహిత్

మాదవ్ బృందావన్ అపార్ట్ మెంట్ లో..

మాదవ్ బృందావన్ అపార్ట్ మెంట్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్ మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు గోవర్థన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మాదవ్ బృందావన్ అపార్ట్ మెంట్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అపార్ట్ మెంట్ వాసులు

బాలాజీ నగర్ సెక్షన్ కార్యాలయంలో…

విద్యుత్ శాఖ బాలాజీ నగర్ సెక్షన్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఘంటసాల సుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెక్షన్ స్టాప్ సబ్ ఇంజనీర్ సంతోష్, ఫోర్ మెన్ కే. వెంకటేశ్వర్లు, లైన్ ఇన్‌స్పెక్టర్ మహేష్, లైన్ మెన్ రాజేందర్ నాయక్, జేఎల్ఎం సంతోష్, రాజశేఖర్, కార్మికులు వేణు, గిరిధర్, మాణిక్య రెడ్డి, వెంకటేష్ గౌడ్, శీను, మైపాల్ రెడ్డి, అబ్దుల్, గౌస్, రాజు నాయక్, కృష్ణారెడ్డి, సతీష్ నాయక్, లక్ష్మణ్, పోలయ్య, నరేందర్, పృథ్వి రాజ్, మోహన్, శైలజ తదితరులు హాజరయ్యారు.

బాలాజీ నగర్ లోని సెక్షన్ కార్యాలయంలో జెండావందనం

ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో…

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ పీ ఎస్ ఆర్ ఎం పీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. వెంకట్ రెడ్డి, డా. శివశంకర్ నల్లగండ్ల హుడా లే అవుట్ ప్రాంతంలోని కూలీలకు బట్టలు, పండ్లను పంపిణీ చేశారు. డా.శివశంకర్, డా. శ్రీనివాస్, డా. జాన్ సైమన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు బట్టలను పంపిణీ చేస్తున్న డాక్టర్ వెంకట్ రెడ్డి
చందానగర్ లోని భవానిపురం లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కాలనీ వాసులు
మదీన గూడలోని పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు యూసుఫ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here