బిజెపి నుంచి టీఆర్ఎస్ లోకి చేరిక – గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని, సంక్షేమ పథకాలను చూసి ఆయా పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం శుభసూచకం అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లోని బిజెపికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు సైనికునిగా పనిచేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కిరణ్ కుమార్, శ్యామ్, యాదగిరి, నర్సింహ, వినయ్,‌ శంకర్,‌ చందు, నాని, దేవదుర్గస్వామి, శివరాజ్, వల్లెపు గిరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో‌ టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, ప్రతాప్ రెడ్డి, మాధవరం గోపాల్ రావు, మహేందర్ ముదిరాజ్, గోపరాజు శ్రీనివాస్ రావు, మహమ్మద్ ఖాజా, జాంగిర్, సుప్రజ, స్వరూప, హన్మంతరావు, రాజు గౌడ్, రవి గౌడ్, శివ ముదిరాజ్, శ్రీను,‌‌ వెంకటేష్, జంగం మల్లేష్, శ్రీధర్ ముదిరాజ్,దయానంద్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, రాజు ముదిరాజ్, వజీర్,‌ రాజు, విజయ్ ముదిరాజ్, రాజు, సుభాష్ చంద్రబోస్ నగర్ నాయకులు రాములు నాయక్, బాలస్వామి, సంతోష్ ముదిరాజ్, సుభద్ర, చందు, శ్రీకాంత్ రెడ్డి, మారయ్య, పోచమ్మ, లక్ష్మణ్, గురువయ్య, నగేష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, స్వామి, కుమార్, నాగేశ్వరవు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here