సర్వే నంబర్ 136 లోని స్థలాన్ని కాపాడాలని డీసీ కి బిజెపి నాయకుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 136 లోని ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని శేరిలింగంపల్లి డీసీని బిజెపి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీసీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకన్నకు వినతి పత్రం అందజేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సర్వే నంబర్ 136 లోని ఎనిమిది ఎకరాల స్థలాన్ని ముస్లింలకు, ఎస్సీలకు స్మశాన వాటికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయని, ఈ స్మశానవాటికలకు పూర్తిగా ఫెన్సింగ్ వేసి ఉన్నా ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఫెన్సింగ్ ను ను కూల్చేసి కబ్జా చేశారన్నారు. కంకర గుంట అనే భావి ని టీఆర్ఎస్ నాయకుల అండదండలతో కొందరు అక్రమార్కులు పూర్తిగా మట్టితో పూడ్చేసి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అండదండలు చూసుకొని కబ్జాకోరులు ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని, దీని పక్కనే ఉన్న గచ్చిబౌలి గ్రామ స్థలాన్ని కబ్జా చేశారన్నారు. తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా చూసి స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని డీసీ వెంకన్నకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎల్లేష్, తోట్ల భరత్ కుమార్, జై హింద్ యాదయ్య, బాలరాజు, అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డ రాజు, లింగం, గడ్డ పరశురాం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డీసీ వెంకన్నకు వినతిపత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here