నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని దశల వారీగా సమస్యలను పరిష్కరించి డివిజన్ అభివృద్ధి చేస్తామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లో స్థానికులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రహదారుల విస్తరణ, యూజీడీ ఏర్పాటు తదితర ఏర్పాట్లపై పరిశీలించారు. తారానగర్ లో సీసీ రోడ్లు, యూజీడీ తదితర వాటిని దశల వారీగా ఏర్పాటు చేసి పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో వార్డు మెంబర్ కవిత, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, నాయకులు జనార్ధన్ గౌడ్, క్రిష్ణారెడ్డి, సయ్యద్ మీర్ అలీ, గోపి, చంద్రశేఖర్, బాబు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
