విద్యార్థుల ప్రాణాలతో చలగాటమాడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలు – టీఆర్ఎస్ యువజన నాయకులు రోహిత్ ముదిరాజ్

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 30 వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తే నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు ఓపెన్ చేసి నడపడం సరికాదని టీఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ యువజన అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ విద్యార్థులతో తరగతులను నిర్వహించడంపై రోహిత్ ముదిరాజ్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో పాఠశాలను బంద్ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా సంస్థలను బంద్ చేస్తే వాటిని పట్టించుకోకుండా ఇష్టారీతిగా పాఠశాలలను నడపడం సరికాదని రోహిత్ ముదిరాజ్ పేర్కొన్నారు.

పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న రోహిత్ ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here