దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చెయ్యాలి – కార్పొరేటర్లతో ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలు ప్రక్రియ పకడ్బందీగా జరిపేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకం అమలు లో భాగంగా 100 మంది దళిత లబ్ధిదారుల ఎంపిక పై మార్గదర్శకాలు, విధి విధానాలపై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నోడల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ హాజరై నియోజకవర్గం లో 100 మంది అర్హులైన దళిత లబ్దిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. వారికి ఇష్టమైన యూనిట్లను ఎంపిక చేసుకుంటే అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, భారతి నగర్ డివిజన్ అధ్యక్షులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

దళిత బంధు అమలు తీరుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here