నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో ప్రజా సమస్యలపై బస్తీ బాటలో భాగంగా కాలనీలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాదయాత్ర చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై పరిశీలించారు. కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ రాయుడు, సీనియర్ నాయకులు వినయ్, బాలరాజు సాగర్, బాలరాజు నాయక్, రాము, శ్రీకాంత్, లవన్ కుమార్, భువన, గిరి, వాసు, సలీమ్, నాగరాజు, అశోక్, భరత్, చందు, రఫీ, నేతాజీ నగర్ కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
