అండమాన్ లో ఆజన్మాంతం వీరసావర్కర్ జైలు గాథ పుస్తకావిష్కరణ

నమస్తే శేరిలింగంపల్లి: భరతమాత కోసం ఎన్నో ఒడిదొడుకులను దాటి స్వాతంత్ర్యం కోసం పనిచేసిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని‌ ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఆజాది కా అమృత మహోత్సవాలలో భాగంగా మెగామైండ్స్ అండమాన్ లో ఆజన్మాంతం వీరసావర్కర్ జైలు గాథ పేరిట ప్రచురించిన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కేపీహెచ్ బీ రోడ్డు నం.1 లోని హర్ష ట్రైనింగ్స్ ఇన్ స్టిట్యూట్ లో నిర్వహించారు‌‌ ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకాన్ని తాడేపల్లి హనుమత్ ప్రసాద్ పరిచయం చేయగా అనువాద రచయిత ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి సావర్కర్ జీవిత విశేషాలు తెలియజేశారు. సావర్కర్ ఎన్నో కష్టాలకోర్చి దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేశారని, సర్వస్వాన్ని భారతమాతకు అర్పించారని, నేటి యువత సావర్కర్ మార్గంలో నడవాలని దేశ అభివృద్ధి కై పాటుపడాలని వివరించారు. సామాజిక, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భాస్కరయోగి మాట్లాడుతూ మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని సుభాష్ చంద్రబోస్ చెప్పిన వాక్యాన్ని గుర్తుచేశారు. దేశం కోసం సర్వస్వాన్ని నేతాజీ ధారపోశారని, నేడు అనుభవిస్తున్న సుఖాలన్నీ ఎందరో మహానుభావుల త్యాగాల వలన వచ్చినవని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులందరిని మనం గౌరవించుకోవాలని గుర్తుచేశారు. కార్యక్రమం లో హర్ష ట్రైనింగ్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హర్ష, మెగామైండ్స్ రాజశేఖర్, విద్యార్థులు, పలువురు కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

అండమాన్ లో ఆజన్మాంతం వీరసావర్కర్ జైలు గాథ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here