నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని, కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ కాలనీలో ప్రజా సమస్యలపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బస్తీ బాట నిర్వహించారు. కేశవనగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను, ఇబ్బందులను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. బస్తీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరును పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడుతూ కేశవనగర్ లో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, మురికి కాలువల పనుల గురించి చర్చించారు. బస్తీలో వెంటనే కొత్తగా సీసీ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ బస్తీబాట కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు రమేష్, కిషన్ గౌలి, ఈశ్వర్, ప్రసాద్, రాజు, శ్రీను, వెంకటేష్, రాజు, రంగ, యాదగిరి, హనుమంతు, శైలు, పాపి, గోరఖ్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.