నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, స్థానిక నాయకులు వెంకటేష్, శివ, రాణి, దేవేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.