నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి ఫీవర్ సర్వేను చేపట్టడం జరుగుతుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ లోని వార్డు కార్యాలయంలో శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బందితో ఇంటింటి ఫీవర్ సర్వేపై కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి ఫీవర్ సర్వే చేపట్టడం జరుగుతుందని, హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వే చెపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్, కరోన టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఫీవర్ సర్వేలో లక్షణాలు ఉన్న వారికి కరోన చికిత్స కిట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో శానిటేషన్ ఎస్ఆర్ పీ మహేష్, ఎంటమాలజీ గణేష్ ఉన్నారు.