నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ప్రజా సమస్యలపై బస్తీ బాట నిర్వహించారు. కాలనీలో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.