టీపీయూఎస్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రమౌళి నియామకం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో పలువురికి ఆయా పోస్టులను రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పల్లపు చంద్రమౌళికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నియామకపు పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పిఎంపి ఆర్ఎంపి విభాగం రాష్ట్ర ఇంచార్జిగా డాక్టర్ ఎ. రమేష్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో బి పి యు ఎస్ రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు గుర్రపు గంగాధర్, ఎడ్యుకేషన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రో పి వై రమేష్, టిపియుఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి రామకృష్ణ, సెక్రెటరీ జనరల్ విద్యా వెంకట్, మీడియా వింగ్ ఇంఛార్జి ఎర్ర యాకయ్య, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్రావణి రెడ్డి, శేరిలింగంపల్లి టిపియుఎస్ అధ్యక్షుడు జంగం సంగమేష్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జంషెడ్ రవి, శేరిలింగంపల్లి సెక్రెటరీ జంగం మల్లేష్, రంగారెడ్డి మహిళ ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, శేరిలింగంపల్లి వైస్ ప్రెసిడెంట్ టెన్నిస్ లక్ష్మణ్, తదితరులను నియమించారు. వీరికి ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.

టీపీయూఎస్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రమౌళిని నియమిస్తూ నియామకపు పత్రాన్ని అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here