ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రవికుమార్ యాదవ్ రూ. 50 వేల విరాళం

నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. సిద్దిఖ్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ రూ. 50 వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలవడుతుందని అన్నారు. ఆలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సిద్దిఖ్ నగర్ లో చేపడుతున్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి తమ సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, బసవరాజ్, తిరుపతి రెడ్డి, యాదయ్య, భాస్కర్, చారి, సాగర్, గణపతి, వెంకటేష్, సుగుణమ్మ, మణేమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here