అభివృద్ధి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు – కార్పొరేటర్లు ఒక్కో చెరువును దత్తత తీసుకుంటారు – సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా పూర్తి చేసి సహకరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ప్రియాంక అల సమక్షంలో కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పెట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధుల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై కార్పొరేటర్లు, అధికారులు, కాంట్రాక్టర్ల తో ప్రభుత్వ విప్ గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లు సహకరించాలని అన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక దృక్పథంతో పని చేయాలని సూచించారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు డివిజన్ల వారిగా అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్షించి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తప్పవని, పని చేసే వారికే పనులను అప్పగించాలని అధికారులకు ఎమ్మెల్యే గాంధీ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్వయంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అలసత్వం వహించేది లేదని చెప్పగా సకాలంలో పని చేసేందుకు కాంట్రాక్టర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సివరేజ్ వ్యవస్థ, రోడ్లు, లింక్ రోడ్లు, చెరువుల సుందరీకరణ, స్మశాన వాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, నల్లగండ్ల ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం , ఫూట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. చెరువుల సుందరీకరణలో భాగంగా ఆయా డివిజన్ల పరిధిలోని ఒక్కో చెరువును సంబంధిత కార్పొరేటర్ దత్తత తీసుకోవడం జరుగుతుందని అన్నారు‌. కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రశాంత్ నగర్ చెరువు, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గోపి చెరువు, జగదీశ్వర్ గౌడ్ మీనాక్షి మీది కుంట చెరువు, ఉప్పలపాటి శ్రీకాంత్ గుర్నాథమ్ చెరువు, పూజిత జగదీశ్వర్ గౌడ్ ఈర్ల చెరువు, మంజుల రఘునాథ్ రెడ్డి లింగం కుంట చెరువులను దత్తత తీసుకుంటారని ఎమ్మెల్యే గాంధీ వెల్లడించారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలో ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం పనులు, మిషన్ కాకతీయ, చెరువుల సుందరీకరణ, అపర్ణ నుండి గంగారాం వరకు రోడ్ ఏర్పాటు పనుల ఆలస్యం పై, శ్రీ దేవి థియేటర్ నుండి అమీన్ పూర్ వరకు రోడ్ నిర్మాణం పనుల ఆలస్యం పై అధికారులతో చర్చించారు. మురళీధర్ సొసైటీ రోడ్, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, లింక్ రోడ్ల ప్రతిపాదనలు, మురుగు నీటి వ్యవస్థ, వైకుంఠ ధామాల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డెవలప్‌మెంట్, సమీకృత వ్యాపార కేంద్రాల ఏర్పాటు, స్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం స్థల సేకరణ,నాలాల విస్తరణ, అభివృద్ధి అంశాల పై సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ చర్చించారు. సమావేశంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్,‌ ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, ఎస్ ఈ శంకర్ నాయక్, శేరిలింగంపల్లి ఈఈ శ్రీనివాస్, చందానగర్ ఈఈ శ్రీకాంతిని, శేరిలింగంపల్లి జోన్ టౌన్ ప్లానింగ్ సీసీపీ నర్సింహా రాములు, ఏసీపీ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here