నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పండగను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురంలో కాలనీ వాస్తవ్యులు సందీప్, కిరణ్ బాబు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులను ఆకట్టుకునేలా వేశారు. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ముగ్గుల రూపంలో బయటకు తీసి సంక్రాంతి పండగ విశిష్టతను రంగ వల్లుల రూపంలో వెల్లడించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు పూల మొక్కలను బహుకరించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు రఘునందన్ రెడ్డి, సుందరం, వైటీ కృష్ణారెడ్డి, శ్రీనివాస రావు, సందీప్, ఎ. కృష్ణా రెడ్డి,కిరణ్ బాబు, వీరా రెడ్డి, ప్రసాద్, హేమాద్రి, ప్రేమ్ కుమార్, కాలనీ మహిళలు పాల్గొన్నారు.