మియాపూర్ లో బిజెపి మృత్యుంజయ హోమం

నమస్తే శేరిలింగంపల్లి: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్ అధ్వర్యంలో మియాపూర్ డివిజన్ లోని మియాపూర్ హనుమాన్ దేవాలయంలో ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా, రానున్న రోజుల్లో వారికి ఎలాంటి ఆపద రావద్దు అని, గత ఏడున్నర సంవత్సరాలుగా మోదీ పాలనలో భారత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంటే, భారత దేశం స్వతంత్ర వచ్చి 70 సంవత్సరాలు దాటినా పరిష్కారం కాని ఎన్నో, క్లిష్ట సమస్యలను పరిష్కరించారని చెప్పారు. యావత్తు ప్రపంచానికి మార్గదర్శనంగా నిలచిన ప్రధాని నరేంద్ర మోదీని చూసి ఓర్వలేక కొంత మంది దుష్ట శక్తుల నుండి రక్షించాలని, మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి పాలనలో భారత దేశం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి సీనియర్ నాయకులు మువ్వా సత్యనారాయణ,రవి కుమార్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, శ్రీశైలం కురుమ, హాఫిజ్ పేట్ అధ్యక్షుడు శ్రీధర రావు, వసంత కుమార్ యాదవ్, ఆకుల మహేష్, రవి గౌడ్, కలివేముల మనోహర్, నరసింహారావు, కుమ్మరి జితేందర్, వరప్రసాద్, దేవునూరి చందు, ఆకుల లక్ష్మణ్, ఆంజనేయులు, శ్రీనివాస్, గణేష్ ముదిరాజ్, గంగారం మల్లేష్, వినోద్, విజేందర్, వెంకట్, పాపయ్య ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి, డి. ప్రసాద్, డి నాగేశ్వరావు గౌడ, శ్రీనివాస్ నాయక్, సురేందర్ రెడ్డి, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి మోడీ కోసం మియాపూర్ లో మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here