నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సూచించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో యువ మోర్చా ఆధ్వర్యంలో పలువురికి పదవులను నియమించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉంటూ డివిజన్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి లో కాషాయ జెండా ఎగరవేసేలా ప్రతీ కార్యకర్త సైనికునిలా పని చేయాలని అన్నారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ తోట్ల భరత్ కుమార్, శేరిలింగంపల్లి డివిజన్ బిజెవైఎం అధ్యక్షులు క్రాంతి మాదిగ అధ్యక్షతన శేరిలింగంపల్లి డివిజన్ ఉపాధ్యక్షులుగా ఎం. విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీగా జీ. మధు కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా సాయికుమార్, శశాంక్ ను నియమిస్తూ రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా నియామకపు పత్రాలను అందించారు.