నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్ క్లేవ్ కాలనీలో శ్రీకాకుళం జిల్లా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం చందానగర్ వారు రూపొందించిన ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అగ్నికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కోదండ కృష్ణ, అధ్యక్షుడు శాంతరావు, కార్యదర్శి తిరుపతి రావు, కోదండ రావు, వెంకటేశ్వరావు, తాతా రావు, శ్రీనివాస్ రావు, లక్ష్మీ నారాయణ, కృష్ణారావు, శ్రీనివాస్ రావు, రామకృష్ణ, దేవేందర్ రావు,తదితరులు పాల్గొన్నారు.