ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలి- మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: టీనేజీ వయస్సు వారు తప్పకుండా కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మదీనగూడ మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న నారాయణ కళాశాలలో 15- 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థినీవిద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉచితంగా అందజేసిన ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. కరోనా వ్యాక్సినేషన్ తీరుపై అడిగి తెలుసుకున్నారు.

నారాయణ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థి కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. ప్రతి కాలనీ, బస్తీలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ, సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ,కరోనా వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణు గోపాల్, ప్రిన్సిపాల్ రాధిక, వైస్ ప్రిన్సిపాల్ లత, కళాశాల సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ వేయించుకున్న నారాయణ విద్యార్థిని ఆకాంక్ష కొత్త
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here