నమస్తే శేరిలింగంపల్లి: కరోనా ముప్పు మరోసారి సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని మధీనగూడ నారాయణ జునియర్ కళాశాల, నారాయణ హైస్కూల్ లల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 15–18 సంవత్సరాల వయస్సు వారికి ఏర్పాటు చేసిన వాక్సినేషన్ ప్రక్రియను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ అచ్యుత్ బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ రాధిక, ఏఓ నగేష్, సురేష్, శ్రీకాంత్, లత, సుబాష్, అమిత్ తదితరులు పాల్గొన్నారు.