నమస్తే శేరిలింగంపల్లి: యోగా శిక్షణతో ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మానసిక రుగ్మతలు తొలగిపోతాయని ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుల్జాపూర్ వినోద్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యోగా ప్రదర్శనలో ఉత్తమ యోగా శిక్షకులను, ఉత్తమ యోగా సాధకులను 2020-21వ సంవత్సరానికి గాను కూకట్ పల్లి లోని ఆదియోగిపరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో యోగా ప్రదర్శనలలో విశేషంగా రాణిస్తూ ప్రత్యేక ఆసనాలతో అద్భుతంగా ప్రదర్శించి, వివిధ నైపుణ్యాలు సాధించి యోగాలో అనేక సేవలు అందించిన శిక్షకులకు, సాధకులకు కృతజ్ఞతలు తెలిపారు. లింగంపల్లి యోగా ప్రచారక్ ఎస్. రుక్మిణీ మాతాజీ మాట్లాడుతూ సమాజంలో మంచిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతూ యోగా ప్రాముఖ్యతను మీడియా, టీవీ, యూట్యూబ్ , ఫేస్ బుక్ లలో ఉచిత యోగా తరగతులు చెప్పడం అభినందనీయమన్నారు. శివగారి రుక్మిణీ మాతాజీ, డి.క్రాంతి, ఎన్.నీతాజీ, ఎన్.లక్ష్మి, వసంత లక్ష్మి, టి. సంధ్య, సరస్వతి, త్రిపురజీ, దత్త రాధా మనోహర్ జీ లను ఈ సందర్భంగా ఆదియోగిపరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి మల్లికార్జున్ , ఉపాధ్యక్షులు బాలాజీ, కిషోర్ రెడ్డి తో పాటు ఎన్ నీతపరుశురాం, తుల్జాపూర్ శివాజీ, జాదవ్ సాయిప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.