నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండలోని ఆనంద పోచమ్మ దేవస్థానం నుండి అపర్ణ సెరినీ వరకు రూ. 5.65 లక్షల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మసీదుబండ లోని ఆనంద పోచమ్మ దేవస్థానం నుండి అపర్ణ సెరినీ వరకు రూ. 5.65 లక్షల తో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. వీధి దీపాల ద్వారా కాలనీకి కొత్త శోభ వచ్చిందని, వీధి దీపాల వెలుగులతో ప్రకాశవంతమైన కాంతులతో రోడ్లు విరాజిల్లుతున్నాయని చెప్పారు. రాత్రి సమయంలో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా తోడ్పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లికార్జున, ఏఈ రాజశేఖర్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు రవి యాదవ్, పద్మారావు, నాగేష్ గౌడ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నటరాజ్, పవన్, మహేష్, పరమేష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.