రూ. 20.88 లక్షలతో రోడ్డు డివైడర్‌పై లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడలోని ఇండోర్ స్టేడియం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు డివైడర్ పై రూ. 20.88 లక్షల అంచనావ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఖాజాగూడలోని ఇండోర్ స్టేడియం నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రోడ్డు డివైడర్ పై లైటింగ్ ఏర్పాటుతో వాహనదారుల ఇబ్బందుల తీరనున్నాయని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ ఈఈ ఇంద్రదీప్, డీఈ మల్లికార్జున, ఏఈ రాజశేఖర్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు నరేష్, రాగం జంగయ్య యాదవ్, రాజు ముదిరాజ్, రమేష్ గౌడ్, డి. నారాయణ, రాజు యాదవ్,అంజమ్మ, పద్మ, సుగుణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ లో డివైడర్ పై లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here