నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ వినాయక్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో అస్తవ్యస్థంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సరిగా లేక, మంచినీటి వసతి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్ల మీద నెపం వేస్తూ పనులు చెయ్యకుండా తప్పించుకుంటున్నారని వాపోయారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
