నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరం 2022 ను పురస్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని టీఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గాంధీని కలిసిన వారిలో వార్డు మెంబర్ కె. వెంకటేష్ గౌడ్, కె శ్రీనివాస్ గౌడ్, కుమార్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.