నమస్తే శేరిలింగంపల్లి: గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం సందర్భంగా శేరిలింగంపల్లిలోని తారా నగర్ నారాయణ ఉన్నత పాఠశాల లింగంపల్లి శాఖలో అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెపి జోన్ ఏజీఎం వేణుగోపాల్ రావు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ సేవలు ఎంతో అమోఘమైనవని అన్నారు. నేడు మనం అందరం గణిత శాస్త్ర పితామహుడు పిలుచుకునే శ్రీనివాస రామానుజన్ తన చిన్నతనం నుండి గణితశాస్త్రం పట్ల ఎక్కువ మక్కువ ఏర్పర్చుకొని అతడు గణిత శాస్త్రంలో సాధించిన అద్భుతమైన విషయాలను గురించి పాఠశాల విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఇదే తరహాలో విద్యార్థులు కూడా తమ సబ్జెక్టులపై దృష్టి సారించి మంచి స్థాయికి ఎదిగేందుకు ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శశికళ, వైస్ ప్రిన్సిపల్ సునీత పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.