మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి బస్తీ, కాలనీలలో మౌలిక వసతులకు కృషి చేస్తున్నామని, సమస్యలు లేని డివిజన్ గా రూపుదిద్దటానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ లో స్థానికులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంజయ్య నగర్ లో రూ. 29.50 లక్షలు అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను, రూ. 30 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులను స్థానిక నాయకులు, బస్తీ వాసులతో పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు జరగాలని కాంట్రాక్టర్లకు కార్పొరేటర్ హమీద్ పటేల్ సూచించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహా సాగర్, వేలాద్రి, తిరుపతి, శ్రీను, పి. రామకృష్ణ, రాము యాదవ్, గువ్వల రమేష్, విక్రమ్, ఆంజనేయులు సాగర్, సాయి శామ్యూల్ కుమార్, యూత్ నాయకులు కరీం, జుబేర్, సాయి బాబు, సాయి సాగర్ తదితరులు ఉన్నారు.

యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here