కరోనా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ వేసుకోవాలి- బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కర రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేస్తున్న కరోనా వ్యాక్సిన్ ను అర్హులైన ప్రతి ఒక్కరూ వేసుకుని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. గౌతమీ నగర్ కాలనీ మున్సిపల్ పార్కు స్థలంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు కసిరెడ్డి భాస్కరరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ పై కొన్ని సూచనలు చేస్తూ, ఫ్రంట్ లైన్ సిబ్బంది సేవలను కొనియాడారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఆరోగ్య భారతానికి కారకులు కావాలని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలిస్తున్న కసిరెడ్డి ‌భాస్కర రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here