జీహెచ్ఎంసీ బీఎంఎస్ బీఎంయూ నూతన అధ్యక్షునిగా సంజయ్ కుమార్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వరరావు నియామకం

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగ్యనగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వ‌హించారు. ఇదివరకు ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రాజు వర్మ, బాల్ రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ బీఎంఎస్ బీఎంయూ నూతన అధ్యక్షునిగా సంజయ్ కుమార్ సింగ్ ను, ప్రధాన కార్యదర్శిగా జి.రాజేశ్వరరావు, ఎస్ఎమ్ జాబ్రి టి క్రిష్ణ‌న్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీధర్ గౌడ్ ను నియమించారు. తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.

జీహెచ్ఎంసీ బీఎంఎస్ బీఎంయూ నూతన అధ్యక్షునిగా సంజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వరరావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here