నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని బీజేవైఎం రాష్ట్ర మహిళా నాయకురాలు, చందానగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సింధూ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా కసిరెడ్డి సింధూ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రానున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ అహంకారానికి ఈటల రాజేందర్ ను గెలిపించి తగిన గుణపాఠం చెప్పాలని సింధూ రెడ్డి కోరారు. కార్యక్రమంలో కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, శివరత్నాకర్, ప్రదీప్, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.