నమస్తే శేరిలింగంపల్లి: దసరా శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో గల శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో, గోకుల్ ప్లాట్స్ లోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి మండపంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆరెకపూడి గాంధీ తెలిపారు. కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో పాటు మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు, బృందారావు, అక్కరావు, బాలరాజ్, ముక్తార్, రాములు యాదవ్, ఉమ, శ్రీజ రెడ్డి, శశి రేఖ, బ్రిక్ శ్రీను, పితాని శ్రీను, అప్పారావు, దుర్గారావు, సంజీవ రెడ్డి, సత్యనారాయణ, సాంబయ్య, ప్రభాకర్, లక్ష్మీ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

