నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి కమ్యూనిటీ హాల్, నానక్ రాం గూడ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందజేసిన బతుకమ్మ చీరలను స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పేద మహిళలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలనేదే తమ ధ్యేయమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండగకు విశిష్ట గుర్తింపు లభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు బి విటల్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, కిషన్ గౌలి, తుకారామ్. శ్రీకాంత్, మన్నే రమేష్, మీంలాల్ సింగ్, సంతోష్ సింగ్, శివ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, దేవరకొండ గోపాల్, రంగస్వామి, కృష్ణ, టింకు, శివ, వెంకటేష్, రాజు, శ్రీను, విష్ణు, క్రాంతి, నర్సింగ్ రావు, గోవర్ధన్, జీహెచ్ఎంసీ సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.