కొండాపూర్ డివిజ‌న్‌లో ఘనంగా దీన్ దయాళ్‌ జయంతి

నమస్తే‌ శేరిలింగంపల్లి: ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి, అంత్యోదయ విధానాన్ని రూపొందించి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ కి పటిష్ట పునాదులు వేసిన మహోన్నతుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని తెలంగాణ రాష్ట్ర బీజేవైఎం కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాద‌వ్‌ అన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ దీన్ దయాళ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు చంద్ర మోహన్, రంగారెడ్డి(అర్బన్) జిల్లా బీజేవైఎం కార్యదర్శులు కుమార్ సాగర్, పిల్లి సాయి కుమార్, రంగారెడ్డి (అర్బన్ )జిల్లా ఐటీ సెల్ కన్వినర్ మధు రావు, తన్నీరు, బీజేపీ శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి, బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సాగర్ నాయక్, బీజేపీ, బీజేవైఎం నాయకులు నరేష్ ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్, కుమార్ యాదవ్, కృష్ణ, ఆకుల నర్సయ్య,గణేష్ పటేల్,వినోద్ యాదవ్, వినయ్ ముదిరాజ్, సాయి కుమార్ నాయక్, వినోద్ రెడ్డి, వంశీ, అశోక్ రజక, ఆకాష్ ముదిరాజ్, శశి, యువరాజ్, వసంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

బిజెవైఎం ఆధ్వర్యంలో దీన్ దయాళ్ కు నివాళి అర్పిస్తున్న రఘునాథ్ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here