విశాఖ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తూ మియాపూర్ లో పట్టుబడ్డ ముఠా – 30 కిలోల గంజాయి స్వాదీనం

నమస్తే‌ శేరిలింగంపల్లి: గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ సామల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం సురేష్, కరుణాకర్ అనే ఇద్దరు వ్యక్తులు విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ నగరానికి మూడు బ్యాగులలో గంజాయిని తీసుకువచ్చారు. ఈ గంజాయిని హైదరాబాద్ మీదుగా ముంబై తరలించే ప్రయత్నంలో మియాపూర్ వద్ద బస్ లేదా లారీ కోసం వేచిఉన్నారు. ఈ క్రమంలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లతో కలిపి రూ. 4.50 లక్షల విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గాంజా సప్లయి చేస్తున్న నింధితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here