నమస్తే శేరిలింగంపల్లి: వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం, జనప్రియ అపార్ట్ మెంట్స్, హనుమాన్ యూత్ అసోసియేషన్ నందు ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ సందర్శించారు.మండపాల్లోని వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, వార్డ్ సభ్యులు కనక మామిడి వెంకటేష్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, శేఖర్ గౌడ్, పాండు, బాబు గౌడ్, దిలీప్ ముదిరాజ్, లక్ష్మణ, జితేందర్ యాదవ్, సాయి యాదవ్, శ్రీశైలం యాదవ్, మహిళలు పద్మ, లక్ష్మి, శ్రీదేవి, మంజుల తదితరులు పాల్గొన్నారు.
