నమస్తే శేరిలింగంపల్లి:రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను అందుకోవడం ఎవరితరం కాదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 137 మంది లబ్ధిదారులకు రూ. కోటి 37 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి , రోజాదేవి రంగరావు లతో కలిసి బుధవారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారు ఇబ్బందులు పడకూడదని సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్ , గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్ , వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్ , చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ , కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ , ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్ , గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ , దామోదర్ రెడ్డి, నాయకులు సాంబశివరావు , లక్ష్మారెడ్డి , కొండల్ రెడ్డి, నరేష్ , చింత కింది రవీందర్ గౌడ్ , చంద్రిక ప్రసాద్ గౌడ్, పొడుగు రాం బాబు , రమేష్, పోతుల రాజేందర్ , వేణు , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.